వారంతా ఒకే సచివాలయంలో సరదా కొంత కాలం గడుపుకున్నారు. ఏమైందో ఏమోతాజాగా రెండగ్రూపులుగా విడిపోయారు. కలిసున్నపుడు కాలంలో తీసుకున్నవీడియోలు, తాజాగా చేసుకున్న టిక్టాక్లను, సెల్ఫీలను బయట పెట్టుకునిరోడ్డెక్కారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని 5వ వార్డుసచివాలయంలో ఉన్న వలంటీర్లు, సచివాలయ సిబ్బందిలో కొంత మంది కలిపిగ్రూపులకు తెరలేపడంతో వివాదం ముదిరింది. పాత వీడియోలతోపాటు, ఇటీవలకాలంలో తీసుకున్న సెల్ఫీ వీడియోలను బయట పెట్టుకోవడం, అవి సోషల్మీడియాలో హల్చల్ సృష్టించడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులుచేసుకున్నారు.దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు. వీడియోలు చేసినవారికి, వాటిని బయటపెట్టిన వారికి కూడా మెమోలు జారీ చేశారు.ఒకపక్క ప్రజా సేవ చేయాలని, జూనియర్ కలెక్టర్లుగా వలంటీర్లుపనిచేయాలని భావిస్తుంటే, రాజకీయ వలంటీర్ల పెత్తనంతో మిగిలిన వారికిఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సచివాలయాల్లో స్థానికవలంటీర్లు పార్టీల పెత్తనం చూపించడంతో ఇటువంటి వివాదాలుతలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతేరాజకీయ వలంటీర్లు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ లక్ష్యానికే ముప్పుతెచ్చేలా ఉన్నారని వైసీపీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తున్న వలంటీర్లలోని ఓ వర్గం













