సాధారణంగా ఇప్పుడేమి ఎన్నికలు లేవు. ఓట్ల కోసం పాకులాడుకునే రోజులుకావు. మరెందుకు బీసీలపై దాడి జరుగుందంటూ టీడీపీ ఎనలేని ప్రచారానికిదూకుతోంది.. జగన్ బీసీ మంత్రంతో బీసీలలో టీడీపీకి ఉన్న పట్టుకోల్పోతోందా..? ఉన్న బీసీ నాయకుల బలం సరిపోవడం లేదా అనేది వెయ్యినోళ్ల ప్రశ్న. బీసీలలో సామాజిక పరంగా బలమైన కుల నాయకులుటీడీపీలోనే కాదు, వైసీపీలో ఉండటం ఇందుకు కారణం. వైసీపీ రాష్ట్రంలోబీసీలకు అన్యాయం చేస్తుందంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నప్పటికీఅనుకున్నంతగా పార్టీకి మైలేజి రావడం లేదు. దీనికి కారణం జగన్చేస్తున్న ప్రతీ పనికళ్లేదుట కనిపిస్తోంది.
ఏడాది పాలనలో వరలా జల్లుతోపాటు, బీసీ నేతలకు కీలక పదవులు,కులాల వారీగా హామీల అమలుతో బీసీలకు మరింత చేరువవుతున్నాడు.ఇదేకొనసాగితే వలసల బాట పెరిగి బీసీ పార్టీకి బీటలు రెట్టింపయ్యేలాఉంది. వాస్తవానికి బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీల పార్టీగా మొదటినుండి ఉన్నదే. ఆ పార్టీకి వస్తున్న ఓటింగ్ శాతంలో ఎక్కువ బీసీలే.రాష్ట్రంలో కీలక పదవులు చేసిన మహామహులంతా టీడీపీలో ఉండటం ఆపార్టీకి మొదటి నుండి ఉన్న బలం.
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు బీసీలకు పెద్దపీటవేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించింది ఆయనే. ఆ తరువాత చంద్రబాబుబీసీ నేతలతో కోటరీనే నిర్మించుకున్నారు. యనమల రామకృష్ణుడు,ఎర్రన్నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలలో చాలా మందిపెద్దలు పార్టీకిపెద్ద దిక్కయ్యారు.
ఎర్రన్నాయుడు మరణానంతరం వచ్చిన అచ్చెన్నాయుడు కుటుంబపరమైనకీర్తితో బీసీ నేతగానే చలామణి అవుతున్నాడు. అయితే కొంత మందిచంద్రబాబు సిద్ధాంతాలు నచ్చకో, పార్టీలోపెద్దల టార్చర్‌కో..మొత్తంమీద ఇతర నేతలతో పాటు, బీసీలలో టీడీపీ నుండి పలువురు పార్టీలు మారారు.అయినప్పటికీ టీడీపీకి మొన్నటి ఎన్నికల వరకూ బీసీ బలం తగ్గలేదు.అయితే 2019 ఎన్నికల నుండి మాత్రం బీసీల పార్టీకి గడ్డుపరిస్థితినెలకొంది.
ఒక్కసారి జగన్ చూద్దామంటూనే బీసీలు జగన్ కుజై కొట్టడం టీడీపీకి ఉహించని దెబ్బ. ఇలా ఒక్కసారిచూద్దామనుకున్నారంటే అంత పట్టున్న బీసీ పార్టీకి ఎందుకు పట్టు జారిందోఇప్పటికైనా అగ్రనేతలు గుర్తించకపోవడం మైనస్.
తాజా విషయానికొస్తే .. ESI స్కామ్‌లో ఏసీబీ అచ్చన్నాయుడిని అరెస్టుచేసింది.. ఇంకేముంది టీడీపీకీ దొరక్క దొరక్క ఒక పెద్ద ఐటమ్ దొరికింది.బీసీలపై దాడి అంటూ ప్రచారంతో ఊపందుకుంది. జగన్ బీసీలనుఅణగదొక్కుతున్నాడంటూ విపరీత ప్రచారం.
మొన్నటి వరకూ ఎస్సీ నాయకులను జైలుకు పంపాడు జగన్. ఇప్పుడేమోబీసీలను తొక్కేస్తున్నాడంటూ కలరింగ్ ఇచ్చింది. పసుపు వార్తలనుప్రచారం చేయడానికి ఏలాగో ఆ రెండు పత్రికలు ఉన్నాయి కదా..రోజుకోహెడ్డింగ్‌తో జగన్ ను ఆడుకున్నాయి. కొద్ది రోజులు. కాని అచ్చెన్నపైపడ్డ అవినీతి మరక ముందు ఆ పాచీక పారలేదు.
మరీ.. జగన్ ఏమైనా తక్కువోడా అంటే జగమొండికి కేరాఫ్ అడ్రస్..అనుకుంటే చేయాల్సిందే..మాటిస్తే కట్టుబడాల్సిందే అనే సిద్ధాంతంతోముందుకెళ్తున్నాడు. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా ఎప్పటి నుండోఎదురుచూస్తున్న యాదవులకు(సన్నిధి గొల్ల) తిరుమల వేంకటేశ్వరస్వామిఆలయంలో మీరాసి హక్కును కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.మత్స్యకారులు, చేనేతలకు వరాలు. మరోపక్క రాజ్యసభ ఎన్నికల్లో బీసీకురెండు స్థానాలు కేటాయించారు. దీంతో వైసీపీలో బీసీ నాయకులకు మరింత బలంచేకూరింది. బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ చేస్తున్నప్రతిపక్షాల ప్రచారానికి అర్థం లేకుండా పోయింది.
జగన్ తన పార్టీలో మొదటి నుండి ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకటరమణలకు ఎమ్మెల్సీల ద్వారా మంత్రి పదవులను తొలికేబినేట్‌లోనే ఇచ్చాడు. ఆతరువాత పరిణామాలతో మండలి రద్దు నిర్ణయంతోఇబ్బంది ఏర్పడింది. కానీ బీసీల నుండి వీరిద్దరిని రాజ్యసభకుపంపిస్తారని అప్పట్లోనే నిర్ణయించడం అదే మాటపై నిలబడటం జగన్‌కుబీసీల్లో మరింత పట్టు పెంచింది. మొదటి నుంచి బీసీలంటే టీడీపీయే అనేదినానుడిగా ఉండిపోవడంతో వైసీపీలో బీసీలకు అంత సీన్‌లేదనుకున్నారంతా..
కానీ, బీసీలకు వైసీపీ న్యాయం చేస్తుందన్నంతలా జగన్నిర్ణయాలు బీసీలలో కొత్త ఆలోచనకు పునాది వేశాయి. రాబోయేరోజుల్లో టీడీపీ బీసీలను తన వైపు తిప్పుకోవాలంటే బంగారమేకురిపిస్తామన్నంతగా చేయాలమోనంతగా బీసీల్లో మార్పు రావడం టీడీపీకి మింగుడు పడటం లేదు.
వైసీపీ అవలంబిస్తున్న బీసీ సంక్షేమం కంచుకోట టీడీపీకి బీటలువారుతున్నాయి. అందుకే ముందుగా మేల్కొంటున్న టీడీపీ బీసీలపై దాడులు,కేసులంటూ అరచి గీ ..పెడుతుంటే ,బీసీలలో కులాల వారిగా గత ప్రభుత్వంచేయని పనుల చిట్టా క్లీయర్ చేయడంలో జగన్ దూకుడు మాములుగా లేదనేలాఉంది.
దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా అధికారం ఉన్నప్పడుఅలత్వం చేసి ఇప్పడు అరిస్తే లాభమేంటనేది టీడీపీ నేతలను సైతంఆలోచనలో పడేసింది. జగన్ రాజకీయ లబ్ధి కోసమో, లేక వైసీపీకి బీసీలబలం పెంచుకోవడం కోసమో గాని మొత్తానికి బీసీలకంటూ జగన్ ప్రత్యేకతచాటడం బీసీల పార్టీకి గడ్డుకాలమే. రాబోయే కాలంలో పాత బుర్రలకుపదును పెట్టి బీసీల పాట పాడకపోతే బీటలు కాదు...కోటలు బద్దలయినాఆశ్చర్యపోనక్కర్లేదు.











