పోలీసు అంటేనే చాలా మందికి ఒక రకమైన వ్యతిరేక భావం ఉంటుంది. కఠువుగామాట్లాడతారని, సరియైన సమాధానం చెప్పరని, స్టేషన్ల చుట్టూతిప్పించుకుంటారని ఇలా రక రకాలుగా చెప్పుకోవడం సర్వసాధారణం. కానిపోలీసులంతా ఒకేలా ఉండరని వారికి మనస్సు , మానవత్వం ఉంటుందనినిరూపించాడు ఒక ఎస్సై. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికిచెందిన అబ్డుల్ నబీ చూపిన మానవత్వం పోలీసుల్లో మంచి మనస్సుఉంటుందని చాటింది.
పిఠాపురం కోటగుమ్మం కూడలి వద్ద పట్ట పగలు 63 ఏళ్ల వృద్ధుడు ఆకస్మాత్తుగాఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మృతిచెందాడు. అతడుచనిపోయాడనే విషయం ఎవ్వరికి తెలియదు. ఇంతలోగా సమచారం తెలుసుకున్నఎస్సై నబీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక పక్క కరోనా భయంతోవృద్ధుడిని ముట్టుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
నిజంగా ఎస్ఐ తలచుకుంటే ఆయనతోపాటువచ్చిన పోలీసు సిబ్బందితోనైనామృతదేహాన్ని తరలించేలా ఆర్డర్ వేయచ్చు . కానీ పోలీసు సిబ్బందిఎవ్వరిని సాయం అడగలేదు. కనీసం మృతుడు ఏ రోగంతో చనిపోయాడనేదిపట్టించుకోలేదు. కేవలం అంబులెన్స్ సిబ్బంది ఒకరి తోడు తీసుకునిమృతదేహాన్ని స్టక్చర్‌పై వేసి అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికితరలించారు. ఎస్సై మృతదేహాన్ని ధైర్యంగా పట్టుకుని తరలించిన తీరుమానవత్వం ఇంకా బతికుందనే సందేశాన్ని ఇచ్చినట్లైయ్యింది. ఈఫొటోలువైరల్ కావడంతో నెటిజన్లు శభాష్ ఎస్సై నబీ అంటూ ఆయన చొరవకు హర్షంవ్యక్తం చేస్తున్నారు.













