రాష్ట్రంలో వైసీపీకంటూ శత్రువులెవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులే .విచిత్రమేమిటంటే సాధారణంగా ఎక్కడైనా, ఏరాష్ట్రంలోనైనా అధికారపార్టీకిప్రతిపక్షం శత్రువుగా ఉండటం సర్వసాధారణం. కాని ఇక్కడ ఉన్నటీడీపీ, జనసేనలు ప్రతిపక్ష పాత్రను పేపర్లలో మాత్రమేపోషిస్తున్నాయనంటే అతిశయోక్తి కాదు. ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్టుతరువాత జగన్‌పై వీర దూకుడు చేస్తున్న టీడీపీ నేతలు హడావుడితప్పితే పెద్ద పోరాటమేమి కాదనే చెప్పాలి. ఇదిలా ఉంటే..వైసీపీలోమాత్రం రోజు రోజుకి సొంత శత్రువులు పెరిగిపోతుండటం రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది.
ఒక్క మాట చెప్పాలంటే వైసీపీలో అంతర్గత పోరు నివురు గప్పిన నిప్పులాఉంది. ఇటీవల రాష్ట్రంలో కొంత మంది ఎమ్మెల్యేలు జగన్ పాలన తీరుపైవిమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో రెడ్డి పాలనపై వీడియో చేసి మరీ తూటాలుపేల్చారు.
వైసీపీలో తనను బతిమిలాడి తీసుకొచ్చారని, ఎవరి దయా దాక్షిణ్యాల వల్లతాను నెగ్గలేదన్నారు. ప్రజా సమస్యలు చెబుదామంటే ఇప్పుడు జగన్అపాయింట్మెంటే దొరకడం లేదంటూ ఎంపీ రఘరామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో ఆయనలోదాగి ఉన్న అసహనాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు. రాష్ట్రంలో ఇసుక విధానం,మద్యం పాలసీ, ఇతర ప్రజా సమస్యలను నేరుగా జగన్‌కు వివరిద్దామనుకుంటే,జగన్‌ను కలవనీయకుండా కోటరీ అడ్డుపడుతుందన్నారు. పైగా తాను కరోనాటైమ్‌లో ప్రజా సమస్యలు పట్టించుకోలేదని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరిప్రసాద్ రాజుతో తిట్టించి చిన్న కులమైన తమ కులంలో చిచ్చు పెడుతున్నారనితీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రసాద్‌రాజుకు త్వరలో మంత్రి ఇస్తేసంతోషించేవాడిని తానేనని, కాని తనను ఎంత ఎక్కువగా తిడితే అంత త్వరగామంత్రి పదవి ఇస్తారో అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉందన్నారు.ప్రజాప్రతినిధులు సభలు, సమావేశాలు పెట్టొద్దని కోర్టులు చెబుతుంటే,కోర్టుల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా కోవిడ్-19 సమయంలో బయటకురాకుండా ఫోన్ ద్వారా స్నేహితుల సహకారంతో ప్రజలకు సాయంఅందించానన్నారు.
కేవలం వైసీపీలో రెడ్డి కులస్తులకే న్యాయం జరుగుతుందని ఎంపీ రఘరామకృష్ణంరాజు చేసిన వాక్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్లమెంట్లోఉన్న కమిటీల్లో వైసీపీ వచ్చిన ఒక్క పదవిని ఏ రెడ్డికి కట్టపెట్టారోఅందరికి తెలిసిందేనని, పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్ధేశించిమాట్లాడారు. పార్లమెంట్లో తనకు కూడా పదవి వచ్చిందని కాని అదిజగన్ వల్ల మాత్రం కాదని ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు తెలుసుకుంటేమంచిదన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పదవుల్లో చిట్టావిప్పితే కేవలం రెడ్డి ప్రాధాన్యతే కనిపిస్తోందన్నారు. పవన్ ఏమైనా తిడితేకాపు నాయకుల చేత తిట్టించడం, బీసీలు ప్రశ్నిస్తే పార్టీలో బీసీ నేతలచేత తిట్టించడం విచిత్రమైన సిద్ధాంతం వైసీపీలో మాత్రమే ఉందన్నారు.ఇప్పుడు తన ప్రియ మిత్రుడైన నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతోతిట్టించడం కూడా బహుశ ఇందులో భాగమై ఉంటుందన్నారు.
వాస్తవానికి వైెసీపీలో రెడ్డి కులానికి మెజార్టీ వాట ఉన్నప్పటికీ అదేపార్టీకి చెందిన ఎంపీ రఘు రామకృష్ణంరాజు బహిరంగంగా వైసీపీలో రెడ్డిపాత్రను బయటపెట్టడం పార్టీలో కుల పోరుకు దారి తీసింది. ఇప్పటికే జగన్ఇసుక విధానం, మద్యం పాలసీల్లో పార్టీ ఎమ్మెల్యేకు అర్థం కాకుండాపాలిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలనుండి వస్తున్న విమర్శలను ఏలా కట్టడి చేస్తారో లేక ఇంకా చిచ్చురేపుకుంటారనేది ఎంత త్వరగా మేల్కొంటే వైసీపీ నేతలకు అంత మంచిది.












