పి ఎమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం భాగంగా హర్యానా సంస్కృతి ప్రదర్శన
ప్రజా గొంతుక (మార్చి 25) కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల లొ “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమలుఘనంగానిర్వహించారు.వివిధ రాష్ట్రాల సంస్కృతులను పరిచయంచేసి,జాతీయఐక్యతనుపెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు హర్యానా రాష్ట్ర సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు ఇచ్చారు.హర్యానా యొక్క సంప్రదాయాలు,వేషధారణ,భాష, పండుగలు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల నాటికలు ప్రత్యేకతలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు.విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ఈకార్యక్రమంలోఉపాధ్యాయునీయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












