E-PAPER

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో త్రైత శకం కాలసూచిక ఆవిష్కరణ

Date : 25 March 2026, 5:14 pm Posted By : PRAJA GONTHUKA

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో త్రైత శకం కాలసూచిక ఆవిష్కరణ

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో త్రైత శకం కాలసూచిక ఆవిష్కరణ

ఎల్కతుర్తి మండల ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో

ప్రజా గొంతుక:ఎల్కతుర్తి, మార్చి 25

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎన్. విజయకుమార్ త్రైత శకం కాలసూచికను ఆవిష్కరించారు.అని ఎల్కతుర్తి మండల ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి అధ్యక్షులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రైత శకం కాలసూచికలో ఆధ్యాత్మిక అంశాలను సమగ్రంగా, సరళమైన భాషలో పొందుపరిచినట్లు తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అందించిన జ్ఞానం ఇందులో విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను స్పష్టంగా వివరిస్తూ, “యుగాది” అనే పదం “ఉగాది”గా ఎలా మారిందో అర్థసహితంగా వివరించారని స్వామివారిని కొనియాడారు.అలాగే చైత్రమాసం నుంచి ఫాల్గుణమాసం వరకు తెలుగు సంప్రదాయ కాలమానాన్ని ప్రతిబింబించే విధంగా కాలసూచిక రూపొందించబడినందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సి హెచ్ రవి, సూపరింటెండెంట్ కే శ్రీనివాస్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అనురాగ్, జూనియర్ అసిస్టెంట్ కే రమేష్, టైపిస్ట్ ఆర్ రజిని, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్