మహిళల సమస్యలు పక్కన పెట్టి అంగడి వేలమా?ముందుగా మరుగుదొడ్లు నిర్మించండి!
అంగడివేలం బహిష్కరిస్తున్నాం ఉప సర్పంచ్ బైరి రజిత వెంకటేష్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మండల కేంద్రంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అత్యవసరమైన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉప సర్పంచ్ బైరి రజిత వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మండల కేంద్రానికి రోజూ వచ్చే ప్రజలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సమావేశంలో మెజార్టీ వార్డు సభ్యులు మహిళా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మండల కూడలిలో తక్షణమే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేసినట్లు చెప్పారు.అయితే, ఈ సమస్యలను పరిష్కరించకుండా అంగడి వేలం నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆమె మండిపడ్డారు. ముందుగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాకే అంగడి వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు.మహిళల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ బైరి రజిత గట్టిగా కోరారు. ఈ కార్యక్రమంలో బైరి రజిత వెంకటేష్,తవటి భవాని, కక్కెర్ల ఉమా రాణి, గంధ మల్ల మాదవి, దిడిగా చంద్రమ్మ, శివరాత్రి రాజు, దేవరకొండ మల్లేశం, ముద్దసాని నవ్య, కర్రే భాస్కర్, కక్కెర్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










