తెలంగాణ మలిదశ ఉద్యమకారులపై రౌడీషీట్లు ఎత్తివేత......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:23
తెలంగాణ మలిదశ ఉద్యమకారులపై రౌడీషీట్లు ఎత్తివేత.ఫలించిన ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి కృషి
హాలియా పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పాల్గొన్న పలువురుపై నమోదైన రౌడీషీట్లను ఎత్తివేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు వర్ర వెంకటరెడ్డి, వడ్డే సతీష్ రెడ్డి, వర్ర రామకృష్ణారెడ్డి, కోనేటి శ్రీను, గోపిశెట్టి నరసింహ, ఎడారి రాములు, షేక్ హుస్సేన్, నాగార్జున మధుసూదన చారి, సయ్యద్ జావిద్‌పై నమోదైన రౌడీ షీట్లు ఎత్తివేశారు. తమపై పెట్టిన రౌడీ షీట్లను రద్దు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి తో పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, ప్రభుత్వ నిర్ణయంతో విరికి ఊరట లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకటరెడ్డి మాట్లాడుతూ రౌడీ షిట్లు ఎత్తివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విషయంపై నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ని త్వరలో స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు











