E-PAPER

అభాగ్యులకు కేఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్నహస్తం – అనాథాశ్రమానికి రూ.10 లక్షల విరాళం

Date : 23 March 2026, 6:26 pm Posted By : PRAJA GONTHUKA

అభాగ్యులకు కేఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్నహస్తం – అనాథాశ్రమానికి రూ.10 లక్షల విరాళం

అభాగ్యులకు కేఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్నహస్తం – అనాథాశ్రమానికి రూ.10 లక్షల విరాళం

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి23:)

మహేశ్వరం:పేదలు,అభాగ్యులు,అనాథలకు అండగా నిలుస్తూ కేఎల్ఆర్ ట్రస్ట్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకుంది.మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, కేఎల్ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చెన్న లక్ష్మారెడ్డి నాదర్‌గుల్ గ్రామంలోని మాతృదేవోభవ అనాథాశ్రమంకు రూ.10 లక్షల విలువైన భవన నిర్మాణానికి అవసరమైన ఇనుము,ఇతర మెటీరియల్‌ను అందజేశారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,పేదలకు,అభాగ్యులకు,విద్యార్థులకు సేవ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని తెలిపారు.జీవితాంతం సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందిస్తానని పేర్కొన్నారు.అనాథాశ్రమంలో నివసిస్తున్న అభాగ్యులు,నిరుపేదలు,మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు గట్టు గిరి సేవలను ఆయన అభినందించారు.గతంలో ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సహాయం అందించినట్లు తెలిపారు.రూ.10 లక్షల విలువైన మెటీరియల్ అందడంతో ఆశ్రమ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని నిర్వాహకులు గట్టు గిరి సంతోషం వ్యక్తం చేస్తూ కేఎల్ఆర్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.సేవకుడే నాయకుడు:

కిచ్చెన్న లక్ష్మారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నాదర్‌గుల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.ఓట్ల కోసం కాకుండా నిజమైన సేవ కోసం కేఎల్ఆర్ ట్రస్ట్‌ను స్థాపించి పేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.అలాగే పేద విద్యార్థుల అభివృద్ధి కోసం లీడ్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తూ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్