ఫైనల్‌లో కటికపల్లిపై సునాయాస గెలుపు – ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సంజయ్
*(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరంమార్చి23:)*
కటికపల్లిలో నిర్వహించిన జూనియర్స్ టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో తొలిసారిగా బేగంపేట జూనియర్స్ జట్టు పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచింది.ఫైనల్ మ్యాచ్‌లో కటికపల్లి జట్టుతో తలపడిన బేగంపేట జట్టు,చిట్టె సంజయ్ నేతృత్వంలో సునాయాసంగా విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఈ టోర్నమెంట్‌లో చిట్టె సంజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు.జట్టు విజయంలో సహకరించిన బేగంపేట సీనియర్లకు చిట్టె సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.












