అసెంబ్లీ ముట్టడి అడ్డుకున్న పోలీసులు – మహేశ్వరం బిజెపి నేతల అరెస్టులు
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి23:)*
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు పిలుపు మేరకు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై బిజెపి మహేశ్వరం మండల శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని,ఆ వైఫల్యాలను ఎండగట్టడానికే ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.అయితే,ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న బిజెపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి,బలవంతంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు తరలించారని విమర్శించారు.ప్రజల గొంతుకను అణగదొక్కే ప్రయత్నంగా ఈ చర్యలను అభివర్ణించిన బిజెపి నాయకులు,అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును కాలరాయడం దారుణం.ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన బిజెపి పోరాటం ఆగదు అని వారు స్పష్టం చేశారు.అరెస్టు చేసిన వారిలో మండల అధ్యక్షుడు తెలగమల యాదీష్,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుండే వెంకటేష్,బిజెపి రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్,ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు రఘువీర్,ఎస్టి మోర్చా అధ్యక్షుడు కృష్ణ నాయక్,భూత అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు ఉన్నారు.












