బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సహకరించండి
కుత్బుల్లాపూర్ మార్చ్ 23 ( ప్రజా గొంతుక )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ యువ నాయకులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా పార్టీ కార్యకలాపాలపై ముఖ్యమైన చర్చలు జరిగాయి.ఈ భేటీలో ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక స్థాయిలో కార్యకర్తల చురుకుదనం పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించబడింది.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ..గత కొంతకాలంగా తాము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇకపై పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలనే సంకల్పంతో ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు.
కుత్బుల్లాపూర్ ప్రాంతంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. అలాగే పార్టీ నాయకత్వం నుండి తగిన మార్గదర్శకం, అవకాశాలు కల్పించాలని కోరారు.
అదేవిధంగా మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్చార్జి మల్లారెడ్డి తో చర్చించి, తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు సహకరించాలని రాష్ట్ర అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు.
స్థానిక కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీ బలాన్ని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, విషయాన్ని సానుకూలంగా పరిగణిస్తున్నామని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మల్లారెడ్డితో చర్చించి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలనుకునే ప్రతి కార్యకర్తకు అవకాశాలు కల్పించడం బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ భేటీతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పులి బాలరాం, కంది శ్రీరాములు, భీమ్ రాజ్, అరుణ్ రావు, సుహాసిని శక్తి, కవితా రెడ్డి, హరీష్ నాయుడు, మాధవులు, లానా, రమేష్ వేముల, వేణు గౌడ్, కవిత, సుహాసిని, అరుణ్ రావు మురళి, నల్ల జై శంకర్ గౌడ్, అంకం సతీష్, పాండు, మురళి తదితరులు పాల్గొన్నారు.












