ప్రజా గొంతుక ఎల్కతుర్తి మార్చి 23: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని
సూరారం గ్రామంలో ముస్లిం కాలనీ (3వ వార్డు) ప్రజలకు గత కొంతకాలంగా ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సర్పంచ్ భాషబోయిన నీల కొంరయ్య గారి నాయకత్వంలో గ్రామ సెక్రటరీ, కారోబార్, వార్డు సభ్యుల సమక్షంలో ముస్లిం కాలనీలో విద్యుత్ సదుపాయాల మెరుగుదల పనులు ప్రారంభించబడినవి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా పాత వైర్ల స్థానంలో కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం, కొత్త మీటర్లు అమర్చడం, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్‌కు కనెక్షన్ అందించడం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ చర్యల ద్వారా ఇకపై కాలనీలో విద్యుత్ అంతరాయం లేకుండా సాఫీగా సరఫరా అందించగలమని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సర్పంచ్ మరియు గ్రామపంచాయతి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.












