విఎస్ఆర్ నగర్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం..
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం లోని విఎస్ఆర్ నగర్ ప్రాధమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులు గా భాద్యతలు స్వీకరించి పాఠశాలనిర్వహణ లో తమ ప్రతిభ ను ప్రదర్శించి అతిధులు గా విచ్ఛేసిన గ్రామ సర్పంచ్ రేణుక కమలాకర్ అభిమానాన్ని చూరగొన్నారు.ఈ సందర్బంగాఎంఈఓ గా మోతే విద్యాసాగర్,ప్రధానోపాధ్యాయులు గాలక్ష్మిప్రసన్న,ఉపాధ్యాయురాలిగా కలియ సిరి, నాగుల భవ్య, డ్రిల్ మాస్టర్ గా యశ్వంత్ బాబు భాద్యతలు నిర్వహించినారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్యం కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో మెలిగి, బాగా చదివి భవిష్యత్ లో ప్రయోజకులు గా ఎదగాలని సూచించారు.ముఖ్య అతిధి గా విచ్చేసిన గ్రామ సర్పంచ్ గొడుగు రేణుక కమలాకర్ మాట్లాడుతూ పిల్లలు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల పాత్రలో లీనమై చాలా చక్కగా, ఎలాంటి బిడియం లేకుండ బోదించారు.. అలాగే భవిష్యత్ లో తల్లితండ్రులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొని రావాలని పిల్లలను అభినందించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రేణుక కమలాకర్, ఉపాధ్యాయులు రాజేందర్ కుమార్, అంగన్వాడీ టీచర్ హజీర, విద్యార్థుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.











