E-PAPER

గుడి నిర్మాణానికి విరాళం అందించిన మట్టి శ్రీనివాస్ బ్రదర్స్… 

Date : 23 March 2026, 11:09 am Posted By : PRAJA GONTHUKA

గుడి నిర్మాణానికి విరాళం అందించిన మట్టి శ్రీనివాస్ బ్రదర్స్… 

అమ్మవారి దీవెనలతో ప్రజలు చల్లంగా ఉండాలి..

గుడి నిర్మాణానికి విరాళం అందించిన మట్టి శ్రీనివాస్ బ్రదర్స్...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ,తమ్మడపల్లి గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీనివాస గార్డెన్ యజమాన్యం మట్టి శ్రీనివాస్, మట్టి బాలరాజు, మట్టి నరేష్ అన్నదమ్ములు తమ వంతు విరాళంగా 25 వేల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి తమ వంతు కానుక అందించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి దీవెనలతో గ్రామ ప్రజలు చల్లంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండేటట్టు దీవించాలని అమ్మవారిని కోరారు. ప్రజలకు ఆపద సమయంలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉన్నంత చదువులకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి సర్పంచ్ బెజడి సిద్దులు, ఉపసర్పంచ్ (కుల పెద్దమనిషి) గోలకొండ నాగరాజు, కులస్తులు జేరిపోతుల మధు, ముక్క నాగయ్య, పిడుగు యాదగిరి, సుంచు క్రాంతి, కోమ్ము నవీన్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :