E-PAPER

ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

Date : 22 March 2026, 2:15 pm Posted By : PRAJA GONTHUKA

ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

ప్రజా గొంతుక ఎల్కతుర్తి మార్చి 22:సూరారం గ్రామ మాజీ సర్పంచ్, ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు తక్కల్లపల్లి సంపత్రావు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ… సూరారం గ్రామంతో తనకు సుమారు 35 సంవత్సరాల అనుబంధం ఉందని, ఈ కాలంలో గ్రామంలోని ప్రతి వర్గ ప్రజలతో ముఖ్యంగా ముస్లిం సోదరులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రజాసేవా ప్రయాణం, వార్డ్ మెంబర్‌గా, ఉప సర్పంచ్‌గా, అనంతరం సర్పంచ్‌గా కొనసాగి గ్రామాభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఎల్లప్పుడూ నిలిచారని, రంజాన్ పండుగ శాంతి, సౌహార్దానికి ప్రతీక అని అన్నారు. ఈ పవిత్ర సందర్భంలో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని, వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు,

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :