మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ మార్చ్ 21 ( ప్రజా గొంతుక )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు పాల్గొన్నకాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పవిత్ర ఈద్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సహోదర భావం మరింత బలపడాలని కోరుకున్నారు.











