ముఖ్యమంత్రి కి భట్రాజులంటే చులకన ఎందుకు? క్షమాపణలు చెప్పి మాటలు వెనక్కి తీసుకోవాలి
-భట్రాజు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లెపల్లి సీతారామరాజు డిమాండ్.పండిత విద్వాంసులుగా నాటి రాజుల కాలం నుండి ఎంతో ప్రత్యేక స్థానంలో ఉంటూ చరిత్ర ఉన్న భట్రాజు కులస్తులు పవిత్రమైన పండితులుగా,ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నాటి నుండి నేటి వరకు ఎంతోమంది నిరక్షరాసులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించిన తమ కులస్తులను కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈనెల 19 న బిఆర్ఎస్ పాలన ను ఎండగట్టే క్రమంలో తమ కులస్తులను అవహేళన చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడడం అహంకారపూరితమైన పాలనకు నిదర్శనమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం అధికార ప్రతినిధి బొల్లెపల్లి సీతారామరాజు,సంఘ పెద్దలు,కులస్తులు అభివర్ణించారు.సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల పెద్దలతో కలిసి ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 వేల మంది పైచిలుకు తమ భట్రాజు కులస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సీఎం.మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.తమ కులస్తులంటే అంత చిన్నచూపు ఎందుకని,మీ ఫలాలు ఏమైనా గుంజుకున్నామా అని సూటిగా ప్రశ్నించారు.బీసీ లపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని కాంగ్రెస్ పాలకుల తీరును ఎండగట్టారు.లైకులు కొడితే పది రూపాయలు,కామెంట్లు పెడితే వంద రూపాయలు,ప్రచారానికి వెళ్తే వెయ్యి అని.. ఆహారాజా...ఓహోరాజా.. అంటుంటారని అంటూ తమ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా సీఎం.మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు.రెడ్డిల కులస్తులను గూర్చి బీసీ బిడ్డలమైన మేము ఎక్కడ తక్కువ చేసి మాట్లాడిన దాఖలాలు లేవని గుర్తు చేశారు.మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా భట్రాజు కులస్తులను ఇంత అవమానపరుస్తారా..ఇది సబబు కాదని,యాస,భాషా రెండు మార్చుకొని సీఎం పద్ధతి ప్రకారంగా మాట్లాడాలని పునరుద్ఘాటించారుసీఎం.అనుచిత వ్యాఖ్యలను శాసనమండలిలో భట్రాజు కులస్తుల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు వారు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి కృషి చేస్తూ అండగా నిలబడతారని మల్లన్న హామీ ఇచ్చారు.ఎస్సీ,ఎస్టీ ఆట్రాసిటి తరహాలో బీసీ అట్రాసిటీ కూడా అమలయ్యే విధంగా చట్టం రూపొందించాలన్నారు.సీఎం మాటలను వెనక్కు తీసుకొని వెంటనే క్షమాపణలు చెప్పాలని కులస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.కలిసిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అంబటి బాపిరాజు,ప్రధాన కార్యదర్శి మూర్తి రాజు,యువ నాయకులు గాదెరాజు విజయ్,మేడ్చల్ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి రాజు శ్రీరామ్ కూరపాటి లు ఉన్నారు.











