స్థానిక ఎంపీ ఫ్లెక్సీలు తొలగించడం అవమానించడమే
-అధికారులకు కఠిన హెచ్చరిక చేసిన గిరివర్ధన్ రెడ్డి
కుత్బుల్లాపూర్ మార్చ్ 21 ( ప్రజా గొంతుక )
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సుచిత్ర సెంటర్ సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు కేవలం రెండు గంటల్లోనే తొలగించడం పై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...
“ఇది పూర్తిగా పక్షపాత వైఖరి. ఇతర పార్టీల ఫ్లెక్సీలను అలాగే ఉంచి, ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ఎంపీ ఫ్లెక్సీలను మాత్రమే లక్ష్యంగా తీసుకుని తొలగించడం చాలా దురదృష్టకరమన్నారు. ఇది ఎంపీపై అవమానం మాత్రమే కాదని ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు.
ఈ చర్యల వెనుక ఉన్న అధికారులపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని,లేకపోతే బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము” అని ఘాటుగా హెచ్చరించారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, ఎవరి ఆదేశాలతో ఈ చర్యలు జరిగాయో వెల్లడించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంలో డిప్యూటీ కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కట్టా కుమార్, గరిగె శేఖర్, పులి బాలరాం, కంది శ్రీరాములు, భీమ్ రాజ్, నల్ల జై శంకర్ గౌడ్ లు పాల్గొన్నారు.












