E-PAPER

ఎల్కతుర్తి పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు

Date : 21 March 2026, 1:43 pm Posted By : PRAJA GONTHUKA

ఎల్కతుర్తి పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు

ప్రజా గొంతుక మార్చి 21:హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలంలోని గ్రామాలలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎల్కతుర్తి పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు (రోజాలు) పాటించిన ముస్లిం సోదరులకు ఈ పండుగ ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండల పోలీస్ సిబ్బంది గ్రామాలలోని ముస్లిం పెద్దలు, ముస్లిం కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.హిందూ–ముస్లిం సోదరభావంతో అందరూ కలిసి పండుగలు జరుపుకోవడం సమాజానికి మంచి సంకేతమని తెలిపారు. దర్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి అలయ్-బలయ్ కార్యక్రమంలో పాల్గొని, పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీన్ కుమార్,Asi శంకర్ కానిస్టేబుల్ బక్కన్న, విట్టల్ రావు సారంగపాణి వికిల్ భాస్కర్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని పోలీస్ శాఖ ఆకాంక్షించింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :