ప్లాస్టిక్ బ్యాగులు వద్దు- క్లాత్ జూటు, బ్యాగులు ముద్దు
కుత్బుల్లాపూర్ మార్చ్ 21 (ప్రజా గొంతుక)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట సర్కిల్ లోని బండారి లేఅవుట్ శ్రీరాములకుంట పార్కులో "లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్ కార్యక్రమంలో భాగంగా ఒరాకిల్ వాలంటీర్స్ తో ప్లాస్టిక్ బ్యాగ్స్ ల వాడకం పైన అవగాహనతో పాటుగా శ్రీరాములకుంట పార్కులో ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వీకరించారు.ఈ సందర్భంగా లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ... మన రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని పార్కుకు వచ్చే ప్రజలు పార్క్ లో వాకింగ్ చేసే వాకర్స్ ఏమైనా తినుబండారాలు ప్లాస్టిక్ కవర్స్ గాని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ గాని పార్కులోకి తీసుకొని వచ్చినప్పుడు సంబంధిత ఏరియాలో ఉన్న డస్ట్ బిన్ లో వేయడమే కాకుండా మన పిల్లలకు కూడా అది అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ షాపులకు వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ కవర్ల పైన ఆధారపడకుండా మన ఇంటి వద్ద నుండే టిఫిన్ బాక్స్ మన వెంట తీసుకెళ్లినప్పుడు ఎంతో కొంత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వారం అవుతామని అలాగే వారాంతపు సంతలలో సూపర్ మార్కెట్లలో కిరాణా షాప్ లోకి గాని వెళుతున్నప్పుడు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జ్యూట్, క్లాత్ సంచులను వాడాలని ప్రజలకు సూచించారు.ఇలాంటి చిన్నచిన్న మార్పుల వలన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవచ్చని అలాగే పకృతిలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టవచ్చని ప్లాస్టిక్ తో పాటుగా చెత్తను ఎక్కడికక్కడ పారవేయడం ద్వారా దోమల సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ దోమల సమస్య ఎలా ఉందో ప్రస్తుతం మనం అందరం ఎదుర్కొంటున్నామని కేవలం ఈ పార్కులో ఒక గంట సమయంలోనే దాదాపు 6 బ్యాగుల ప్లాస్టిక్ అవశేషాలు స్వీకరించామంటే ప్లాస్టిక్ వాడకం ఏ విధంగా ఉందో మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఇలాంటి ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఒరాకిల్ వాలంటీర్స్ బృందానికి అలాగే పాల్గొన్న కాలనీవాసులకి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా రాబోయే రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలియజేశారు.












