E-PAPER

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు 

Date : 20 March 2026, 7:29 pm Posted By : PRAJA GONTHUKA

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు 

ప్రజా గొంతుక మార్చి 20:అణగారిన వర్గాల ప్రజలను నయవంచన చేసిన రాష్ట్ర వార్షిక బడ్జెట్..

బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెనుకబడిన వర్గాలను పేదరిక నిర్మూలనకు దోహదపడే అన్ని రంగాలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు చేసి నిరుపేద ప్రజలను నయవంచన చేసింది ఈ ప్రభుత్వమని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు ఒక ప్రకటన ద్వారా విమర్శించారు సామాజిక న్యాయానికి పేదరిక నిర్మూలనకు దోహదం చేసే విద్య వైద్య రంగాల సమగ్ర అభివృద్ధికి కలిపి కనీసం మొత్తం బడ్జెట్లో 30 శాతం కేటాయించాల్సి ఉండగా విద్యారంగానికి 8.2 శాతం నిధులు కేటాయించి అత్యంత దారుణంగా వైద్య రంగానికి కేవలం 4.2 నామమాత్రపు నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తూ నిరుపేద వర్గాలకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వమని విమర్శించారు బీసీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేస్తానని చెప్పి బీసీ ప్రజలను నయవంచన చేసి మొండి చేయి చూపించింది ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు నామమాత్రపు కేటాయింపులు మాత్రమే చేసింది పశుసంవర్ధశాఖకు ప్రతి ఏటా బడ్జెట్లో కోత విధిస్తూ పాడి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు రైతు కూలీలకు సన్నకారు రైతులకు ప్రతి ఏటా ఇస్తానన్న ఆర్థిక చేయూతకు మొండి చేయి చూపించారు ఈ బడ్జెట్లో అసంఘటిత కార్మికుల సంక్షేమానికి నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఆహార భద్రత పథకానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం విచారకరమన్నారు ప్రతి సంవత్సరం బలహీనవర్గాల శాఖలకు నామమాత్రం కేటాయించిన బడ్జెట్ పక్కదారి పట్టించి పేద వర్గాల ప్రజలను నయవంచన చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు

కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా కాకుండా పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా సమగ్ర దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని బొంకూరి రాజు కోరారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్