E-PAPER

పత్తిపాక క్రషర్ తో క్రష్ అవుతున్న పర్యావరణం, మానవుల జీవన పరిస్థితులు

Date : 20 March 2026, 1:34 pm Posted By : PRAJA GONTHUKA

పత్తిపాక క్రషర్ తో క్రష్ అవుతున్న పర్యావరణం, మానవుల జీవన పరిస్థితులు

పత్తిపాక క్రషర్ తో క్రష్ అవుతున్న పర్యావరణం, మానవుల జీవన పరిస్థితులు

తుడుం శంకర్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు.

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట (మార్చి20)

హనుమకొండ జిల్లాయు శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన  స్టోన్ క్రషర్ యాజమాన్యం కొండల్ని పిండిచేస్తున్నారు.... నేల, నీరు, మానవుల ఆరోగ్యాలు, వారి ఆవాసాలు ఏమైనా పర్లేదు,పట్టింపు లేదు. బాధ్యత లేదు. తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

రాతి పొడి, దుమ్ము పంట పొలలాని ముంచెత్తడం వల్ల సరైన దిగుబడి రావట్లేదని రైతులు ఉసురు మంటున్నారు, అంతేకాదు పరిమితికి మించి తవ్వకాలు చేయడం వల్ల ఆ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి బోరు బావులు కూలిపోతున్నాయి.

గుట్టల్ని పేల్చడం వల్ల వచ్చు శబ్దకాలుష్యం మరియు వాటి నుండి వెలుపడే విషావాయయుల వల్ల అనేకమంది ప్రజలు అనారోగ్యపాలు అవుతున్నారు, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆయాసం, నిమోనియా, ఊపిరితిత్తుల శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామ ప్రజల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి జంతు జలాలు తమ ఆవాసాన్ని కోల్పోయి ఇండ్లలోకి చొరబడుతున్నాయి.

క్రషర్ వాళ్లు బండలకు బాంబులు పెట్టి పేల్చడం వల్ల వాటి యొక్క చిన్న చిన్న రాళ్లు పంట పొలాల్లో పడుతున్నాయి తద్వారా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరిమితికి మించి తవ్వకాలు జరిగినట్లయితే రియాల్టీ పెనాల్టీలు విధించాలి. స్టోన్ క్రషర్, హాట్ మిక్స్ ప్లాంటు నిర్వహణ, ఏర్పాటు నిబంధనల అమలును పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాలు పర్యవేక్షించాలి.

ప్రభుత్వానికి, పాలకవర్గానికి నా చిన్న సలహా మరియు మనవి:

పర్యావరణానికి పంటలకు ఇళ్లకు మానవులు ఆరోగ్యానికి ముప్పు తీసుకొచ్చే ఇలాంటి క్రషర్ల కంటే అనేకమంది నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక మంచి కంపెనీ తీసుకొని వచ్చి గ్రామాల నుండి పట్టణాలకు వలస బాటపడుతున్న అనేకమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగుల్ని నింపాలని ఆశిస్తున్నాను.

⬇ DOWNLOAD
×

పత్తిపాక క్రషర్ తో క్రష్ అవుతున్న పర్యావరణం, మానవుల జీవన పరిస్థితులు

తుడుం శంకర్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు.

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట (మార్చి20)

హనుమకొండ జిల్లాయు శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన  స్టోన్ క్రషర్ యాజమాన్యం కొండల్ని పిండిచేస్తున్నారు…. నేల, నీరు, మానవుల ఆరోగ్యాలు, వారి ఆవాసాలు ఏమైనా పర్లేదు,పట్టింపు లేదు. బాధ్యత లేదు. తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

రాతి పొడి, దుమ్ము పంట పొలలాని ముంచెత్తడం వల్ల సరైన దిగుబడి రావట్లేదని రైతులు ఉసురు మంటున్నారు, అంతేకాదు పరిమితికి మించి తవ్వకాలు చేయడం వల్ల ఆ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి బోరు బావులు కూలిపోతున్నాయి.

గుట్టల్ని పేల్చడం వల్ల వచ్చు శబ్దకాలుష్యం మరియు వాటి నుండి వెలుపడే విషావాయయుల వల్ల అనేకమంది ప్రజలు అనారోగ్యపాలు అవుతున్నారు, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆయాసం, నిమోనియా, ఊపిరితిత్తుల శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామ ప్రజల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి జంతు జలాలు తమ ఆవాసాన్ని కోల్పోయి ఇండ్లలోకి చొరబడుతున్నాయి.

క్రషర్ వాళ్లు బండలకు బాంబులు పెట్టి పేల్చడం వల్ల వాటి యొక్క చిన్న చిన్న రాళ్లు పంట పొలాల్లో పడుతున్నాయి తద్వారా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరిమితికి మించి తవ్వకాలు జరిగినట్లయితే రియాల్టీ పెనాల్టీలు విధించాలి. స్టోన్ క్రషర్, హాట్ మిక్స్ ప్లాంటు నిర్వహణ, ఏర్పాటు నిబంధనల అమలును పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాలు పర్యవేక్షించాలి.

ప్రభుత్వానికి, పాలకవర్గానికి నా చిన్న సలహా మరియు మనవి:

పర్యావరణానికి పంటలకు ఇళ్లకు మానవులు ఆరోగ్యానికి ముప్పు తీసుకొచ్చే ఇలాంటి క్రషర్ల కంటే అనేకమంది నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక మంచి కంపెనీ తీసుకొని వచ్చి గ్రామాల నుండి పట్టణాలకు వలస బాటపడుతున్న అనేకమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగుల్ని నింపాలని ఆశిస్తున్నాను.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్