ప్రజా గొంతుక: మార్చి 19.హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శుక్రవారం సూరారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలవికాస సమితి ఆధ్వర్యంలో “ప్రపంచ నీటి దినోత్సం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాష బోయిన నీల ఉపసర్పంచ్ మేకల బాబు మాజీ సర్పంచ్ తక్కళ్ల పెల్లి సంపత్ రావు (కబడ్డీ ప్లేయర్) పాల్గొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ నీల కొంరయ్య మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నీటి విలువలు, మంచి ప్రవర్తన, సమాజంలో బాధ్యతతో జీవించే విధానం గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే సద్గుణాలు అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమని, నిజాయితీ, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి విలువలు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ, బాలవికాస సమితి ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.టీచర్లు విద్యార్థులకు నీటి కథలు, ఉదాహరణల ద్వారా స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రసంగాలు, పాటలు, నాటికల ద్వారా నీటి విలువలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాలవికాస సమితి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటరులు బరిగల రమ అలువాల శోభ గుర్రం మహెశ్శరి పుల్లా పద్మ జనుగాని రమ మహిళా సంఘాల సభ్యులు సింగన బోయిన ఇంద్రా విద్యార్థుల్లో మంచి అలవాట్లు, నైతిక విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.











