E-PAPER

అంగన్వాడి ఆరోగ్య లక్ష్మి పాలు నీటి పాలు…

Date : 20 March 2026, 12:32 pm Posted By : PRAJA GONTHUKA

అంగన్వాడి ఆరోగ్య లక్ష్మి పాలు నీటి పాలు…

అంగన్వాడి ఆరోగ్య లక్ష్మి పాలు.. నీటి పాలు...

ప్రజా గొంతుక( మార్చి 20 )కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలోని చిన్నారులకు అందవలసిన ఆరోగ్య పాల ప్యాకెట్లను,ఒర్రె కాలువలో పారబోసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు గర్భిణీలకు సమతుల్య పోషకాహారాన్ని అందించేదుకు , ప్రభుత్వం సంపూర్ణ పోషణ పథకం అమలులో భాగంగా అంగన్వాడి కేంద్రాలకు ఆరోగ్య పాలన పంపిణీ చేస్తుంది. గర్భిణీలకు, చిన్నారులకు అందవలసిన పాలను అంగన్వాడీ నిర్వాహకులు ప్రజలకు అందివ్వకుండా నీటిపాలు చేస్తున్నారని సర్పంచ్ తుల మనోహర్ రావు పేర్కొన్నారు. అంగన్వాడి ఆరోగ్య లక్ష్మీపాలు,నీటి పాలు చేయడం లొ అంతర్యం ఏమిటి అన్నది అర్థం కావడం లేదని,ప్రభుత్వం మహిళల ఆరోగ్య కోసం అంగన్వాడి ద్వారా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన అంగన్వాడీ నిర్వాహకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని తీవ్రంగా ఖండించారు. నేరుగా నీటిపాలైన పాల ప్యాకెట్లను చూస్తే, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుందని వారు అన్నారు. అధికారులు ప్రభుత్వ పాల ప్యాకెట్లను,నీటిపాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.స్థానికులు చూసి తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. ఈ పాల ప్యాకెట్లను పారబోసిన వారి వివరాలు పూర్తిగా తెలియాల్సిన ఉన్నది.

⬇ DOWNLOAD
×

అంగన్వాడి ఆరోగ్య లక్ష్మి పాలు.. నీటి పాలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్