*శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి*
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 19) సూర్యాపేట:శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు సూర్యాపేట పట్టణ ప్రజలపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజారులో గల శ్రీ వేదాంత భజన మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రమూర్తి శంకరమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించగా ఆసాంతం తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. పెద్దల కోరిక మేరకు బొడ్రాయి ప్రతిష్ట కొరకు నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. 74 సంవత్సరాలుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవములు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా,కౌన్సిలర్ల గండూరి రమేష్, లక్ష్మి, పోలబోయిన నర్సయ్య యాదవ్, వెంపటి సురేష్, మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్, వీరవెల్లి రామమూర్తి,రాఘవాచార్యులు, సోమ సుమన్, రాచకొండ శ్రీనివాస్, శీల శంకర్, మొరిశెట్టి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.











