*లింగాయపల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం*
గండీడ్ మార్చి 19
ప్రజా గొంతుక న్యూస్
మహబూబ్ నగర్ జిల్లా
గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దోమ వెంకటేష్. గ్రామ పెద్దలు కలిసి ట్రస్ వేసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దోమ వెంకటేష్ గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా ప్రోత్సాహం పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించడంతో పాటు సామూహిక భావన పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ వెంకటయ్య, రంగారెడ్డి, లక్ష్మయ్య టీచర్, బ్రహ్మానంద రెడ్డి, నర్సింలు, శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.












