*జగన్నాథ్‌పూర్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా పెండ్యాల లోకేష్ ఎన్నిక*
ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా పెండ్యాల లోకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కొమ్మిడి మైపాల్ రెడ్డి ఆధ్వర్యం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు పెండ్యాల లోకేష్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 9 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు అమలు చేసినారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు సమానంగా లబ్ధి చేకూరాయని తెలిపారు. పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి బలోపేతానికి యువత కీలక పాత్ర పోషించాలని గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా శ్రమిస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి సర్పంచ్ పంజాల యాదగిరి గౌడ్ వార్డ్ మెంబర్ పెండ్యాల అనిల్ వోడితల యువసేన వ్యవస్థాపకులు గోడిశాల చిట్టి గౌడ్ మాజీ ఉపసర్పంచ్ మొద్దుల భాస్కర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ యువత పాల్గొన్నారు











