రంజాన్ కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మాజీఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మార్చ్ 19 ( ప్రజా గొంతుక )కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గురువారం రోజున వచ్చే రంజాన్ పర్వదిన సందర్భంగా రంగారెడ్డి నగర్ డివిజన్ కు చెందిన మోటే శ్రీనివాస్ యాదవ్, అరువ వెంకట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పండగ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్య పండగ నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ... రంజాన్ పర్వదినం సందర్భంగా నిరుపేదలకు పండగ నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోటే శ్రీనివాస్ యాదవ్, అరువ వెంకట్ లను అభినందించి ప్రజాసేవ లో మరింత ముందుకు నడవాలనివారికి దీవించారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు












