మహిళల రైతులకు డ్రోన్లు!...
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి...
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సర్పంచుల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై , డ్రోన్లను ఆపరేట్ చేయడంలో మహిళలకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుందన్నారు. సబ్సిడీ ఇస్తూ మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. పంటలకు పురుగు మందుల పిచికారీలో అధునాతన ఆవిష్కరణ అయిన డ్రోన్‌ను వినియోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించిన నేపథ్యంలో ఇందులో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పరికరలను సబ్సిడీపై మహిళ రైతులకు అందిస్తుందని అన్నారు. యూనిట్ కాస్ట్ 9,76,500 సబ్సిడీ నాలుగు లక్షలు, లబ్ధిదారుల వాటా మూడు లక్షలు ,మండల సమైక్య ద్వారా రుణం 2 లక్షల 76500 ఉంటుందని దీనికి గ్రామంలోని గ్రామ సంఘంలో దరఖాస్తు చేసుకోవాలని మహిళా సంఘం లోని సభ్యులు 10వతరగతి చదువుకొని ఉండాలని అన్నారు.











