పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
ప్రజాగొంతుక. కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్...... కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు , పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం, తదితర వాటి పై ఆరా తీశారు.ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. .












