E-PAPER

స్వర్గీయ పెంచల్ రెడ్డి వర్ధంతిలో పాల్గొన్న కొలను హన్మంత్ రెడ్డి

Date : 18 March 2026, 3:13 pm Posted By : PRAJA GONTHUKA

స్వర్గీయ పెంచల్ రెడ్డి వర్ధంతిలో పాల్గొన్న కొలను హన్మంత్ రెడ్డి

స్వర్గీయ పెంచల్ రెడ్డి వర్ధంతిలో పాల్గొన్న కొలను హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ మార్చ్ 18 ( ప్రజా గొంతుక ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కి.శే. యాలమూరి పెంచల రెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ... యాలమూరి పెంచల రెడ్డి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయులని కొనియాడారు. భగత్ సింగ్ నగర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండేవారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ టి.లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కేయం గౌరీష్, కృష్ణాగౌడ్, రషీద్, మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

స్వర్గీయ పెంచల్ రెడ్డి వర్ధంతిలో పాల్గొన్న కొలను హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ మార్చ్ 18 ( ప్రజా గొంతుక ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కి.శే. యాలమూరి పెంచల రెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ… యాలమూరి పెంచల రెడ్డి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయులని కొనియాడారు. భగత్ సింగ్ నగర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండేవారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ టి.లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కేయం గౌరీష్, కృష్ణాగౌడ్, రషీద్, మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్