రెండేళ్లయింది హామీలు ఏమయ్యాయి...
బిజెపి మండల అధ్యక్షుడు బంగారు మహేష్.
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలుచేయడం విఫలమైనందున బీజేపీ ఆధ్వర్యంలో ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం పై బిజెపి పోరుబాట పట్టింది అని దీనిలో భాగంగాబీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బచ్చన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు బంగారు మహేష్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడంజరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలకు 100 రోజులలో చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చుకోవడం చాలా సిగ్గుచేటని అన్నారు వెంటనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని అన్నారు.మోసపూరిత వాగ్దానాలు,అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు వాటిని అమలు చేయడం లో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.గత రెండున్నర సంవత్సరాలుగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన యువత కు నిరుద్యోగ భృతి కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని దీనికోసం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఖాళీగా ఉన్నా ఉద్యోగాలనుభర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారువృద్దులకు,వితంతువులకు,వికలాంగులకు కొత్త పెన్సషన్లు వెంటనే మంజూరు చేయాలని,రైతులకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదలచేయాలని,అర్హులైననిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను వెంటనే పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి సర్పంచ్ బేజాడి సిద్ధులు, మన్ సన్ పల్లి సర్పంచ్ గీస సందీప్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గద్దరాజు, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కక్కెర్ల గణేష్, మండల నాయకులు అభిషేక్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.











