E-PAPER

టౌన్‌షిప్‌లో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదు 

Date : 17 March 2026, 4:13 pm Posted By : PRAJA GONTHUKA

టౌన్‌షిప్‌లో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదు 

టౌన్‌షిప్‌లో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదు

కుత్బుల్లాపూర్ మార్చి 17 ( ప్రజా గొంతుక ) దుండిగల్ జిహెచ్ఎంసి పరిధిలోని  టౌన్‌షిప్‌లో జరుగుతున్న అక్రమ రోడ్ ఆక్రమణలపై నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టౌన్‌షిప్ అసోసియేషన్ (రిజిస్ట్రేషన్ నం.1493/2017) ఆధ్వర్యంలో గత మూడు నుంచి నాలుగు నెలలుగా ప్రజావాణి ఫిర్యాదు వ్యవస్థ ద్వారా పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.ప్రజావాణి ద్వారా మాత్రమే కాకుండా మునిసిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్‌కు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.టౌన్‌షిప్‌లో కొంతమంది వ్యక్తులు రోడ్లను అక్రమంగా ఆక్రమించి కమర్షియల్ షెడ్ నిర్మాణాలు చేపడుతున్నారని,దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడంలోఅధికారుల నిర్లక్ష్యం వల్ల టౌన్‌షిప్ ప్రజలు తీవ్ర అసౌకర్యాలనుఎదుర్కొంటున్నారని తెలిపారు.అందువల్ల సంబంధిత అధికారులు ఈ సమస్యను అత్యవసర సమస్య గా పరిగణించి టౌన్‌షిప్‌లో జరిగిన రోడ్ ఆక్రమణలను వెంటనే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.అలాగే ఆమోదించబడిన లేఅవుట్ రోడ్లను రక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నరసింహ రాజు, సభ్యులు రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సి. వెంకమ్మ నాయుడు, ఖజాంచి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్