రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన వ్యవసాయ అధికారులుప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధివరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లె రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ (ఆత్మ ) వారి సహకారంతో వరిలో ప్రాధాన్య రకాల ప్రోత్సాహకం మరియు వరిలో స్వల్ప మధ్యస్త దీర్గకాలిక రకాల గురించి చర్చించారు అదేవిధగా రైతులకు కావలసిన విత్తనాన్ని స్వంతంగా ఏవిధంగా తయారుచేసుకోవాలి దానికి కావలసిన జాగ్రత్తలను వివరించారు హెచ్ టీ పత్తి సాగు యొక్క ప్రతికూల ప్రభావాలు భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువుల వాడకం సమీకృత వ్యవసాయం మంచి వ్యవసాయ పద్దతుల అవలంబన నూనె పంటల సాగుకు ప్రోత్సాహకం మరియు జీవ నియంత్రణ కారకాలైన ట్రైకోడెర్మా విరిడి సుడోమోనాస్ భాస్వరాన్ని కరిగించు బాక్టీరియా &వేపనూనె మొదలగు వాటి ఉపయోగాల గురించి వివరించారు ఈ కార్యక్రంలో మండల వ్యవసాధికారి నాగరాజు ,శాస్త్రవేత్త గోన్యా నాయక్ ,సర్పంచ్ చాగంటి మమత ,ఏఈఓ లు ,రైతులు బొప్పిడి కిషన్ రెడ్డి ,వీర రెడ్డి ,సూరయ్య ,సొల్లేటి రవి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు












