వేలేరు మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరం
-మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి ప్రారంభించారు
ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి (ప్రసాద్): వేలేరు మండల కేంద్రంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేలేరు మండల కేంద్రంలో స్పెషాలిటీ వైద్యులచే మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ ప్రతీప్, సర్పంచులు అశోక్, మనోజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను మరింత విస్తరించాలని కోరారు.వేలేరు గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన జిల్లా డీఎంహెచ్ఓ, అదనపు డీఎంహెచ్ఓ ప్రతీప్, స్థానిక మెడికల్ ఆఫీసర్ నవీన్‌కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు శ్రీకర్,రమేష్, జీపీ కార్యదర్శి రవికుమార్, ప్రముఖ వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు......












