గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి సన్మానం.
ప్రజా గొంతుక మార్చి 16 కాల్వ శ్రీరాంపూర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది ఉత్తమ సేవలకు సన్మాన కార్యక్రమాలు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాజరవేణ స్వరూప సదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, నిర్వహణ కార్యక్రమంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని, శాలువాతో సన్మానించి అభినందించారు. గ్రామపంచాయతీలకు మీ సేవలు మరింత అవసరమని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.












