ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిబ్బందికి గౌరవం
ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( ప్రసాద్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, తాగునీటి సరఫరా తదితర పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తించి ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించి శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి రవికుమార్,వార్డు సభ్యులు సంధ్య, సురేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు....












