వర్గ రహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే.
సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 15)సూర్యాపేట : ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత, దోపిడీ నిర్మూలన సిద్ధాంతకర్త, పెట్టుబడి లోగుట్టుని వెలికి తీసిన మహనీయుడు , దోపిడీ నుండి కార్మిక వర్గం విముక్తి చెందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు అవ్వాలని, సోషలిస్ట్ సమాజం ను నిర్మించాలని , చెప్పిన మహోదాత్త సిద్ధాంతకర్త కార్ల మార్క్స్ 143వ వర్ధంతిని సూర్యాపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి శివకుమార్ లు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ మానవ శ్రమ సృష్టించిన సంపదకు శ్రమే కారణమని, ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతుల్లో ఉండదు ఉన్నాయో వారే అదనపు విలువని లాభాల పేరుతో అనుభవిస్తున్నారని , కార్మిక వర్గం శ్రమజీవులుగా ,దోపిడీకి గురయ్యే వారుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికి కారణం శ్రమజీవులే అన్నారు. శ్రమ దోపిడీ విముక్తి సిద్ధాంతాన్ని మార్క్స్ తన పెట్టుబడి గ్రంథం ద్వారా అదనపు విలువ సిద్ధాంతాన్ని సమాజం ముందు పెట్టారన్నారు.కాబట్టి వర్గ సమాజంలో దోపిడీ రహిత సమాజం కోసం కార్మిక వర్గం పోరాడాల్సి ఉంటుందని, సమానత్వ సమాజం కోసం కార్మిక వర్గ పోరాటాలు ఉత్తేజవంతంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సిద్ధాంతాన్ని నేర్చుకోవడం, దానికి అనుగుణమైన ఆచరణాత్మక పోరాటాలు నిర్వహించడం కార్మిక సంఘాల బాధ్యత అని అన్నారు. కార్మిక వర్గ నాయకత్వాన పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాలు నిర్వహించాలని నేడు సామ్రాజ్యవాదం మాణిక్య విస్తరణ కోసం పెట్టుబడులకు మరింత లాభాన్ని గడించడం కోసం యుద్ధాలను చేపట్టిందని , యుద్ధ వ్యతిరేక పోరాటాన్ని కార్మికులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కే సూర్యం ,ఎస్ఎల్ పద్మ, జాతీయ ఉపాధ్యక్షులు వీ.కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శలు గొడ్డలి నరసయ్య పాల్గొన్నారు.












