E-PAPER

నిఖార్సయిన సామాజిక సేవా కార్యకర్త……. అమీర్ అలీ

Date : 15 March 2026, 1:51 pm Posted By : PRAJA GONTHUKA

నిఖార్సయిన సామాజిక సేవా కార్యకర్త……. అమీర్ అలీ

నిఖార్సయిన సామాజిక సేవా కార్యకర్త....... అమీర్ అలీ

హై కోర్టు న్యాయవాది షేక్ హమీద్.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:15యువత ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాలి పలు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి: తెలంగాణ హైకోర్టు న్యాయవాది హమీద్ షేక్ నిఖార్సయిన సామాజిక సేవా కార్యకర్త అమీర్ అలీ అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ అభివర్ణించారు. యువత అమీర్ అలీ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిరుపేద కుటుంబాలకు అమీర్ అలీ ఫౌండేషన్ అందిస్తున్న దాతృత్వం అనిర్వచనీయమని అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో పలు వార్డుల్లో అచేతన స్థితిలో ఉన్న పలు నిరుపేద కుటుంబాలకు వారి నివాసాల వద్ద అమీర్ అలీ ఫౌండేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేసింది. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అమీర్ అలీ ఎంచుకున్న దృక్పథం స్ఫూర్తిదాయకం అని అన్నారు. మనిషి సంఘ జీవి. వృత్తిరీత్యా పెయింటర్ అయిన అమీర్ అలీ తన ఆదాయంలో కొంతభాగం సామాజిక అభ్యున్నతి కోసం పాటుపడటం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఎంచుకొని ప్రతినెలా బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందిస్తున్న అమీర్ అలీ సమాజానికి మార్గదర్శి అని హమీద్ షేక్ తెలిపారు.

⬇ DOWNLOAD
×

నిఖార్సయిన సామాజిక సేవా కార్యకర్త……. అమీర్ అలీ

హై కోర్టు న్యాయవాది షేక్ హమీద్…….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్