E-PAPER

జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి.

Date : 14 March 2026, 8:48 pm Posted By : PRAJA GONTHUKA

జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి.

జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి.

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన ప్రస్తుత ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి.ఎం. సంతోష్ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ కు శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ మొదటిసారిగా సంతో ష్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక జిల్లా పరిపాలనపై పట్టు సాధించారని కొని యాడారు. అన్ని శాఖల గురించి క్షుణ్ణం గా తెలుసుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పూర్వపు కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ హైదరాబాదులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసి మొదటి సారి జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడంతో మంచి అనుభవం పొందానని, జిల్లా అధికార యంత్రాంగంతో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి పనిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో తనకు సహక రించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా నిర్వహించడంలో పూర్వపు కలెక్టర్ సంతోష్ సహకారం మరువ లేనిదని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగిం దన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పూర్వ పు కలెక్టర్ సంతోష్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అనంత రం ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ ను అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారా యణ, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాస రావు, ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్