జగిత్యాల ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై విజ్ఞాన యాత్ర శిక్షణ కార్యక్రమం
ప్రజా గొంతుక న్యూస్ జగిత్యాల ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామాల నుండి 150 మంది ఆయిల్ పామ్ రైతులను రైతు విజ్ఞాన యాత్ర మరియు రైతు శిక్షణా కార్యక్రమం నిమిత్తం సిద్దిపేట జిల్లాలోని అక్కనపల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలను , నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని సందర్శించడానికి తీసుకువెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.జిల్లాలో 2022-23 సంవత్సరంలో నాటిన తోటల నుండి ఈ మే, జూన్ నెల నుండి కోత ప్రారంభమవుతుంది కావున అట్టి రైతులను సిద్దిపేటలోని తోటలలో కోత విధానం, ఫ్యాక్టరీ సందర్శించడం జరుగుతుంది.సిద్ధిపేట జిల్లా అక్కెనపల్లి గ్రామంలోని రైతుల కోత దశలో ఉన్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలించడం జరిగింది. అక్కడి రైతులు మాట్లాడుతూ కోత ప్రారంభమైనప్పటి నుండి ఈ 2 సంవత్సరాలలో 31 సార్లు గెలల కోత చేయడం జరిగిందని, మిగతా పంటలతో పోలిస్తే కోతుల బెడద, అకాల వర్షాల వల్ల నష్టం లేకుండా ఈ పంట లాభదాయకంగా ఉందని తెలిపారు.రైతులు ఎలాంటి దశలో గెలల కోత చేపట్టాలో స్వయంగా పరిశీలించడం జరిగింది.అనంతరం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ ని సందర్శించడం జరిగింది.అక్కడి అధికారులు ఫ్యాక్టరీ లో ఆయిల్ తయారుచేసే విధానం రైతులకు వివరించడం జరిగింది.ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రైతులకు అన్ని పంటల కంటే ఆయిల్ పామ్ లాభందయకంగా ఉంటుందని, పంట ప్రాముఖ్యత వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటల పరిశీలన , ఫ్యాక్టరీని సందర్శించి వారి యొక్క సందేహాలను పంచుకొని సూచనలను జాగ్రత్తగా విని అధికారులు చెప్పిన సూచనలకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ విజ్ఞాన యాత్రలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీమతి లత, సాంకేతిక ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, ఉద్యాన అధికారులు శ్రీమతి స్వాతి, శ్రీమతి అర్చన, శ్రీనివాస్ రెడ్డి,ఉద్యాన విస్తరణ అధికారులు రాజేష్, అన్వేష్, అనిల్, అనిల్, వంశీ, శ్రీలత,ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్ని మండలాల నుండి 150 దాక మంది రైతులు పాల్గొన్నారు.











