14వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించనందుకు, ఉపాధి హామీపథకం ద్వారా ఇంటర్నల్ రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం వహించినపంచాయతీరాజ్శాఖకు చెందిన 15 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలుతీసుకునేందుకు ప్రభుత్వం జీవో 322 విడుదల చేసింది. పంచాయతీరాజ్‌శాఖ,ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ద్వారా ఈ ఉత్తర్వులువెలువడ్డాయి. విశాఖ జిల్లా, కడప, తూర్పుగోదావరి జిల్లాకు చెందినపంచాయతీరాజ్శాఖ ఈఈ, డీఈఈ, ఏఈలు, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు,ఎంఈవో ఉన్నారు. ఇందులో కొంత మంది ఇటీవలే రిటైర్ ఉన్నారు. 14వ ఆర్థికసంఘం ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులను వీరు సక్రమంగావినియోగించలేదన్న అభియోగాలున్నాయి.













