ల్యాబ్ టెక్నీషియన్ ల సేవలు అభినందనీయం
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
రాయికల్ పట్టణంలోని ప్రపంచ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహిస్తున్న సంతోష్ గౌడ్ ను సామాజిక సేవకులు బత్తిని నాగరాజు చేతుల మీదుగా ఘనంగా శాలువ తో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ ల సేవలు అభినందనీయం అని రోగ నిర్ధారణ లో ల్యాబ్ టెక్నీషియన్ లు కీలకంగా మారారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోద్దులశివ కుమార్, సంజీవ్ రాచకొండ వెంకటేష్, బాపురపు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు












