ఫిరయింపులపై కేటీఆర్ ఆసత్య ప్రచారం మానుకోవాలి
ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావతి గోవింద్ నాయక్
ప్రజా గొంతుక డెస్క్
అసెంబ్లీ స్పీకర్ తీర్పుపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని. ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ విమర్శించారు. గతంలో వారి పార్టీ చేసిన చర్యలను మరచి ఇప్పుడు నైతిక బోధనాలకు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని పేర్కొన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో అనేకమంది ప్రజా ప్రతినిధులను వారి పార్టీలో చేర్చుకొని పార్టీ ఇరయింపులకు త్వరలో తెరిచిందని తెలిపారు ఆ కాలంలో 38 మంది ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్సీలు ఒక ఎంపీని బిఆర్ఎస్ లో చేర్చుకున్నారని వారు గుర్తు చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకొని ప్రతిపక్షాన్ని బలహీనపరచారని విమర్శించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్కు సరైన ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారన్నారు ఒక దళిత నాయకుడైన *మల్లు భట్టి విక్రమార్క ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చూడలేకపోవడం* బిఆర్ఎస్ వైఖరిని వెల్లడిస్తుందని విమర్శించారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విరాయింపుల గురించి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం!!దయ్యాలు!!వేదాలు వల్లించి నట్టే ఉందని తీవ్రంగా విమర్శించారు,గతంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నిటికి బాధ్యుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు అందుకే ఆయనను రాజకీయ వర్గాల్లో తెలంగాణ ఫిరాయింపుల పీతగా పేర్కొంటున్నారని ఎదవ చేశారు ప్రస్తుతం స్పీకర్ తీరుపై అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు











