కామ్రేడ్ఉయ్యాల కొండయ్య మృతి సిపిఎం పార్టీ కి తీరనిలోటు
సిపిఎం పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
సిపిఎంపార్టీఅభివృద్ధి కొరకు పాటుపడిన నాయకులు కామ్రేడ్ ఉయ్యాల కొండయ్య
సిపిఎం పార్టీ జిల్లాకార్యదర్శి
మల్లు నాగార్జున రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 12)సూర్యాపేట: మునగాల మండలపరిధిలోని నరసింహులగూడెం గ్రామానికి చెందిన సిపిఎంపార్టీసీనియర్ నాయకుడు,ఉయ్యాల కొండయ్య ( 70 ) బుధవారం రాత్రి 7:00 గ0" కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతితో నరసింహుల గూడెం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.ఉయ్యాల కొండయ్య సిపిఎం పార్టీలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్ననాయకుడిగా గుర్తింపు పొందారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన పేరు నిలిచింది. రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహిస్తూ ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.
సుదీర్ఘ రాజకీయఅనుభవంతో ప్రజలతో సన్నిహితంగామెలిగి సేవలందించిన ఆయన
గ్రామరాజకీయంతో పాటు, మండల స్థాయిలో కూడా గుర్తింపు పొందారు.ఆయన 25 సంవత్సరాలు వార్డు మెంబర్ గా, కల్లు గీత సొసైటీ ప్రెసిడెంట్ గా, పిఎసిఎస్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఉయ్యాల కొండయ్య మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పుతూ నివాళులు అర్పించారు.రాజకీయ రంగంలో సుదీర్ఘ కాలం సేవలందించిన ఉయ్యాల కొండయ్య మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈకార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు,రాష్ట్రకమిటీసభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు,మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు,కొలిశెట్టి యాదగిరిరావు, ఉయ్యాల నర్సయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీసభ్యులుజూలకంటి విజయలక్ష్మి, కోట గోపి, షేక్ సైదా, కొండారెడ్డి,గ్రామప్రజలు తదితరులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.












