*మానవసేవయే మాధవ సేవ*.
*-జర్నలిస్టు రామాంజనేయులు) ఆధ్వర్యంలో...*
*-గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాతల సహకారంతో షెడ్డు ఏర్పాటు.*
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాతల సహకారంతో మా నవసేవయే మాధవసేవ గ్రూపు నుండి జర్నలిస్టు రామాంజనే యులు ఆధ్వర్యంలో షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచు
కొని ప్రయాణికులకు ఇబ్బంది
గా ఉన్న తరుణంలో గమనించి దాతల సహకారంతో ప్రయాణి కులు నిలువ నీడన ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఎండా కాలం కారణంగా దాహార్తిని తీర్చేం దుకు చలివేంద్రాన్ని కూడా ఏర్పా టు చేసే విధంగా జర్నలిస్టు రా మాంజనేయులు తెలిపారు. షెడ్డు ఏర్పాటుకు సహకరించిన దాతలు బంగి రాజేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గద్వాల 360 న్యూస్ గ్రూప్, బండ ల పాండు 34వ, వార్డు మాజీ కౌన్సి లర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు బం డల వెంకట్ రాములు మాట్లాడు తూ.. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టు రామాం జనేయులు మంచి నిర్ణయం తీసుకున్నారని ఇదే సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ లో మరియు కృష్ణవేణి చౌక్ అలాగే ఇతర చోట్ల ప్రయా ణికులు నిలబడే చోటును ఎంపిక చేసినట్లయితే తన వంతు సహాయ సహకారాలు అందించి షెడ్డు ఏర్పా టుకు కృషి చేస్తానని బండల వెంక ట రాములు తెలిపారన్నారు. 37వ,వార్డు కౌన్సిలర్ మంజురాణి కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టు రామాంజనేయులు ఇంకా ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్ర మాలు మరెన్నో చేయాలని వారు తెలిపారు.











