వ్యర్థాలను రోడ్డుమీద పారయ్యొద్దు
సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి
ప్రజా గొంతుక మార్చి 12 అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి
ములకలపల్లి:మండల పరిధిలో మూకమామిడి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గురువారం ముకమామిడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అన్ని దుకాణదారులు తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.దుకాణాలలో పాడైపోయిన బల్క్ వ్యర్ధాలు రోడ్డుమీద పడేయొద్దని వాటిని సంచులలో ఎత్తి డంపింగ్ యార్డ్ దగ్గర పడేయాలని లేదా పంచాయతీ ట్రాక్టర్ గ్రామాలలో వచ్చినపుడు అందులో వేయాలని సూచించారు.మాంసం,చేపల వ్యర్థాలను దుకాణదారులు డంపింగ్ యార్డ్ దగ్గర పడేయాలని దుకాణదారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కేసుపాక శ్రీనివాసరావు వార్డు మెంబర్ భూక్య అశోక్, బచ్చల చైతన్య కుమారి,ఆశ వర్కర్ గుగులోత్ జ్యోతి,కొడిమె వనిత, సున్నం లక్ష్మి, అంగన్వాడి టీచర్ వేప విజయ,దుకాణదారులు అద్దంకి రమేష్,అనంతుల నిర్మల,చిట్టి సత్యనారాయణ, అనంతుల వీరస్వామి,సీమకుర్తి కిషోర్, వీరమల్ల నాగరాజు పంచాయతీ సిబ్బంది కొరసా వెంకటేష్ కొండ్రం శ్రీను గడ్డం వెంకటేష్ కుంజా నగేష్ సున్నం శ్రీను బత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












