స్వచ్ఛమైన ‘భగీరథ’ నీరే లక్ష్యం
అధికారులతో కలిసి కదిలిన ఉప సర్పంచ్
ప్రజా గొంతుక న్యూస్ మార్చి 12 కొత్తగూడెం(చుంచుపల్లి):
గ్రామ ప్రజల ఆరోగ్యమే పరమావధిగా, పాలకవర్గ సమన్వయంతో ధన్బాద్ గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పరిధిలోని మిషన్ భగీరథ ఓవర్ హెడ్ రిజర్వాయర్‌ను ఉపసర్పంచ్ ప్రేమ్ కుమార్ స్వయంగా పర్యవేక్షించి, శుభ్రపరిచారు.గ్రామస్తులకు కలుషితం లేని మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో, ఎంబి (MB) విభాగం అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపసర్పంచ్ ప్రేమ్ కుమార్‌తో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేందర్, బహుళార్థసాధక కార్మికుడు రాజు కలిసి ట్యాంక్‌ను క్షుణ్ణంగా శుభ్రం చేసి, సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. క్రమం తప్పకుండా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ"ప్రజల ఆరోగ్యం మా బాధ్యత. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా చూడవచ్చు. అధికారుల సహకారంతో ధన్బాద్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం."
. అని అన్నారు











