E-PAPER

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక.

Date : 11 March 2026, 8:48 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక.

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని 12వ వార్డులోని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షరీఫా బేగం ఖాజా ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వెనుక భాగం నుండి చావటి వరకు పనికిరాని పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని తొలగించారు. వార్డులో ఉన్న కొన్ని సైడ్ డ్రైనేజీలను శుభ్రం చేశారు. అనంతరం 12వ వార్డ్ కౌన్సిలర్ షరీఫా బేగం ఖాజా మాట్లాడుతూ వార్డులో ఉన్న ఏ సమస్యలైనా తమ దృష్టికి తేవాలని, వీధిలైట్లు రాకున్నా తెలియజేయాలని, వార్డు అంత శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ అనిల్, సిఏలు మమత, లత, మున్సిపల్ సిబ్బంది కృష్ణ, జాను మరియు వార్డు ప్రజలు కొక్కుల సురేందర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్